Medicinal plants(ఆయుర్వేదం)

అశ్వగంధ

అశ్వగంధ ఒక ప్రాముఖ్యమైన ఆయుర్వేద మొక్కల్లో ఒకటి. దీనిని సాధారణంగా ఇండియన్ జెన్సింగ్ లేదా వింటర్ చెర్రీ అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం “వితానియ సోమ్ని పెర”

ఇది చాలా రకాల అనారోగ్యాలను నయం చేసే ఒక గొప్ప ఔషధ మొక్క.

దీనిని సంస్కృతంలో అశ్వగంధ అంటే అశ్వం అంటే గుర్రం గంద అంటే వాసన కలిగిన మొక్క అని అర్థం.

అశ్వగంధ

ఇది దొరికే ప్రాంతాలు

అశ్వగంధ భారతదేశంలో ఎక్కువగా మధ్యప్రదేశ్ రాజస్థాన్ పంజాబ్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఎక్కువగా ఇది మనకు కనపడుతుంది ఇది పొడి నెలలో వేడి వాతావరణంలో కూడా పెరుగుతుంది.

అశ్వగంధ యొక్క ఉపయోగాలు

1. ఇది శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది దీనిని పొడి చేసుకుని తాగడం ద్వారా శరీరం చాలా శక్తివంతంగా ఆరోగ్యంగా ఉంటుంది.

2. ఇది బీపీ ఉన్నవారు వాడితే రక్తపోటును నియంత్రిస్తుంది

3. రక్తంలో సుగర్ లెవ్వాల్సిన కూడా క్రమబద్ధీకరిస్తుంది

4.. మేధుడిని చాలా అద్భుతంగా పనిచేసే విధంగా మరియు చురుగ్గా తమ పనులను చేసుకునే విధంగా మరియు డిప్రెషన్ వంటి సమస్యల నుండి బయట పడే విధంగా ఇది సహాయపడుతుంది

5. నిద్రలేమితో బాధపడే వారికి ఇదొక అద్భుతమైన పరిష్కారం మనం కోరుకునే విధంగా నిద్ర ఈ పొడి వాడడం ద్వారా చేకూరుతుంది.

మానసిక ఆరోగ్యానికి

మానసికంగా బాధపడుతున్నప్పుడు ఈ పొడి వాడడం ద్వారా మనం సాధారణంగా ఎదుర్కొనే జలుబు జ్వరం దగ్గు ఇంకా ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు ఉండే బయటపడే విధంగా మనకు సహాయపడుతుందిలు జరిగి మానసిక ఒత్తిడి నుండి బయట పడే విధంగా మనసు శాంతి కలిగే విధంగా ఇది సహాయపడుతుంది.

మనకు కలిగే కోపము మరియు ఆందోళన బాధ వీటన్నిటి నుండి కూడా విముక్తి కలిగి మనసు శాంతిగా ఉండే విధంగా సహాయపడుతుంది

మన యొక్క బాధను మార్చి మానసికంగా ఆహ్లాదాన్ని కలిగిస్తుంది

వ్యాధి నిరోధక శక్తి ఇమ్యూనిటీ పెరగడానికి

ఈ పొడిని ప్రతిరోజు వాడడం ద్వారా శరీరంలో కలిగే వ్యాధులనుండి రోగనిరోధక శక్తిని మారుస్తుంది.

మనం సాధారణంగా ఎదుర్కొనే జలుబు

జ్వరం దగ్గు ఇంకా ఇతర వైడల్ ఇన్ఫెక్షన్లు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ నుండి బయటపడే విధంగా సహాయపడుతుంది.

ఫర్టిలిటీ

పురుషుల్లో ఎక్కువగా వీర్యకణాల సంఖ్యను పెంచే విధంగా సహాయపడుతుంది.

స్త్రీలకు గర్భాశయం బలపరిచే విధంగా ఇది సహాయపడుతుంది

తయారీ విధానం

మొదట దీని యొక్క వేర్లను తీసుకువచ్చి బాగా కడిగి శుభ్రం చేయాలి

దీని యొక్క వేర్లను చక్కగా ఎండిపెట్టి పొడి చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి

దీని యొక్క ఎండిన వేర్లను గ్రైండర్ లో వేసి బాగా పొడి చేయాలి

ఉపయోగించే విధానం

రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని పాలు చెంచా అశ్వగంధ పొడి కలిపి తాగాలి

శరీర బలహీనత కోసం రోజుకు ఒకసారి తేనే లేదు పాలుతో కలిపి దీనిని తీసుకోవచ్చు

మెదుడు యొక్క ఆరోగ్యానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో కూడా దీనిని మనము తెలుగులో కలిపి తీసుకోవచ్చు

దీని యొక్క కషాయాన్ని తాగడం ద్వారా జలుబు దగ్గు ని కూడా దూరం చేయవచ్చు

అశ్వగంధ యొక్క సైడ్ ఎఫెక్ట్స్

దీని అధిక మోతాదులో వాడడం ద్వారా ఒక్కొక్కసారి పట్టనొప్పి స్వామి అధిక నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది

వారు ఇతర సమస్యలు ఉన్నవారు వైద్యులు సలహా మేరకు దేని వాడాలి గర్భిణీ స్త్రీలు థైరాయిడ్ సమస్యలతో ఉన్నవారు దీనిని ముఖ్యంగా వైద్యులు పర్యవేక్షణతో వాడాలి

ఎక్కడ దొరుకుతుంది

ఆయుర్వేద మెడికల్ షాపులలో మరియు ఆన్లైన్ ఫ్లాట్ ఫార్మ్స్ లలో మరియు కొన్ని ఇతర మార్కెట్ రూపంలో మనకి లభిస్తాయి

ముగింపు

అశ్వగంధ అనేది మన సాంప్రదాయం లో ఆయుర్వేదంలో ఒక గొప్ప ఔషధం. ఇది ఆరోగ్యాన్ని పెంచే విధంగా అనేక రకాల ప్రయోజనాలను కలిగి ఉంటుంది దీనిని సరింగా వాడే విధానం తెలుసుకుంటే ఇది మనకు మానసిక ఆరోగ్యాన్ని మరియు నరాల బలహీనతను శరీరంలో శక్తిని వ్యాధి నిరోధక శక్తిని మరియు మెదడు చాలా చురుగ్గా పనిచేసే విధంగా ఈ ఔషధం ఉపయోగపడుతుంది.

గమనిక: దీనిని వాడాలంటే వైద్యుని సలహాతో వాడడం ఉత్తమమైన మార్గం

మీ ఆరోగ్యాన్ని రక్షించుకోండి ఆయుర్వేదం గురించి తెలుసుకోండి

Leave a Comment